by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:28 PM
కొండాపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే గ్రంథాలయం నూతన కార్యవర్గాన్ని గ్రంధాలయ వ్యవస్థాపకులు మార్వాడి గంగరాజు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .చైర్మన్ : కనమేని పెంటా రెడ్డి వైస్ చైర్మన్ పెద్దూరి శ్రవణ్ కుమార్ వీరితోపాటు 30 మంది డైరెక్టర్లతో కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మార్వాడి గంగరాజు మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో, అని మహాపురుషులు అన్నట్టుగా గ్రంధాలయాలు ప్రతి గ్రామంలో యువతను సన్మార్గంలో ఉంచడానికి దోహదపడతాయని, సెల్ ఫోను ద్వారా యువత చెడుదారి పట్టకుండా గ్రంధాలయాలు వినియోగించుకొని తెలుగు సాహిత్యం పైన మక్కువ పెంచుకోవాలని అన్నారు.
గతంలో ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకున్న లక్కిరెడ్డి అరవింద్ రెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగ సంపాదించారని అతనిని గ్రామస్తులు అభినందించారు . ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్లు తమ ఎన్నికకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు .