by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:25 PM
జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో భాగంగా... స్పెషల్ ఆఫీసర్ వెంకట శివ ప్రసాద్, ఆర్ఐ సందీప్ రెడ్డి, ఏఈఓ రాకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ... నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం అందించి.అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని సంక్షేమ అభివృద్ధి నిరంతర.
ప్రక్రియ అని ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ వారు సభను ఏర్పాటు చేయడం జరిగిందని లిస్టులో పేర్లు రానివారు అర్హులు ఉంటే గ్రామపంచాయతీ కార్యదర్శి అప్లికేషన్ ఇవ్వగలరని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.