by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:24 PM
వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని మద్గుల్ చిటం పల్లి గ్రామంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. 2వ రోజు ప్రజాపాలన వార్డు సభ* కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 6,7,8,9,10,11,12,13,14,15వ వార్డులలో వార్డు సభలు నిర్వహించగా.8వ వార్డు మద్గుల్ చిట్టెంపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గ్రామస్తులకు సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పిస్తూ వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల వివరాలు చదివి వినిపించారు. అర్హులు అయినప్పటికీ లిస్టులో పేరు రాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి కూడా పథకాలు అందిలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు గోపాల్, పరిగి సంతోష, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు, కమిషనర్ జాకీర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.