by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:06 PM
నంబర్ ప్లేట్స్ లేకుండా రహదారులపై తిరిగే ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి జరిమానా విధించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించి నెంబర్‌ప్లేట్ లేని, సగం విరిగిపోయిన నంబర్ ప్లేట్లు మరియు అక్షరాలను టాంపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న 25 ద్విచక్ర వాహనదారులను పట్టుకుని వారికి ట్రాఫిక్ చలాన్లు విధించినట్లు ఎస్ఐ సంతోష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ ద్విచక్ర వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు వేయించి, వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ అమర్చు కోవాలన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు.