by Suryaa Desk | Thu, Jan 23, 2025, 01:55 PM
వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో సీఆర్పీఎఫ్ సభ్యులు స్థానిక పాఠశాల కంపౌండ్ లో స్థలం చదును, ప్రధాన గేటు ముందు డ్రైనేజి ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సభ్యులు వెంకటేష్, ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ కృష్ణయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ స్రవంతి, ఎమ్మార్వోప్రభాకర్, ఏఈవో రవీంద్ర, ఎంవి ఫౌండేషన్ మండల ఇన్ ఛార్జ్ హానిమిరెడ్డి పాల్గొన్నారు.