by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:05 PM
మేడిపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ను అమలు చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కళా ప్రదర్శన కార్యక్రమంలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చంకన డప్పు వేసుకొని ఫిబ్రవరి 7న హైదరాబాద్ తరలి రావాలని మేడిపల్లి తెలంగాణ అంబేద్కర్ మండల అధ్యక్షులు బంగారు దీపక్ తెలపడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అంటరానితనంతో బాధపడుతున్న కులాలను షెడ్యూల్ కులాలుగా రాజ్యాంగంలో పొందుపరిచి షెడ్యూల్ కులాలలో ఉన్న 59 కులాలు అభివృద్ధి చెందాలని విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. అలాంటి రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలలోని ఒక కులానికి పరిమితమవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలలోని అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన అందాలనే సామాజిక న్యాయం కొరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నిరంతర పోరాటం చేయడం జరిగింది.
నిరంతర పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న లక్ష డప్పులు వెయ్యి గొంతుల కళా ప్రదర్శన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చంకన డప్పు వేసుకొని హైదరాబాదు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు డప్పు ప్రేమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి మకిలి సురేష్, ఎర్ర జగన్, ప్రణయ్, నరేష్, అనిల్, నాగేందర్, సుధీర్, సాయి, నితిన్, అజయ్, ప్రదీప్, నిఖిల్, రాకేష్, నితిన్, శశి, చైతన్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.