by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:17 PM
నగరంలో ట్రాఫిక్‌కు(Traffic )ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. గురువారం మోండా మార్కెట్, రాంగోపాల్ పేట, బేగంపేట డివిజన్‌లో పర్యటించారు. ఫుట్ పాత్ వ్యాపారులతో సమావేశమై పలు పూసూనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారులు నిర్దేశించిన స్ధలాల్లోనే వ్యాపారాలు జరుపుకోవాలన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఫుట్ పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.