by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:17 PM
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడి బీబీపేట మండలం తుజాల్‌పూర్‌లో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిడిని ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు.
మూడేళ్ల క్రితం రూ.3 లక్షల ఇంటి రుణం ప్రవీణ్ తీసుకున్నాడు. అయితే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగా మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.