by Suryaa Desk | Fri, Jan 24, 2025, 12:45 PM
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. నిన్న, మొన్న వరకూ కిలో రూ. 20 పలికిన టమాటా ధరలు తాజాగా కనిష్టానికి దిగిపోయాయి. తాజాగా అనంతపురం కుక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా రూ.12కు అమ్ముడు పోయింది. మార్కెట్‌కు 600 టన్నుల టమాటా రాగా సరాసరి ధర రూ.10 కాగా, కనిష్ట ధర రూ.8 పలికినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. ధర పతనంతో పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.