by Suryaa Desk | Thu, Jan 23, 2025, 08:03 PM
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాస తీర్మానం అంశంపై ఎల్లుండి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు సమావేశాల్లో సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.