by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:05 PM
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలాగా సంక్షేమ పథకాలను కొంతమందికే కాకుండా అందరికీ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా లిస్టులు తయారుచేసి వారు అనుకున్న పేర్లను పెట్టి వారికి పథకాలను అందజేసి మిగతా వారికి మొండి చేయి చూపించిందని మా ప్రభుత్వం అలా కాకుండా నేరుగా దరఖాస్తుదారుల పేర్లను గ్రామసభలోనే చర్చించి రాని వారి పేర్లు సైతం మరల దరఖాస్తు చేసుకొని అవకాశం కల్పించిందని ఇది ప్రజా ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. కావాలని ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రజలు వారి మాటలను నమ్మవద్దని ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన ఉద్ఘటించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి సైతం ప్రతి గ్రామసభలో రాని వారి పేర్లను మరల దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు చెప్పమని తమకు తెలిపినట్లుగా వారు పేర్కొన్నారు.
గ్రామ సభలు పూర్తి చేయగానే అర్హులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని అనంతగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామంలో గ్రామ సభల్లో దరఖాస్తు చేసిన పేరు రాలేదని అభద్రతకు గురికావొద్దని రేషన్ కార్డులు ఇందిరమ్మ భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ద్వారా అందిస్తాం అని చెప్పారు పథకాల అమలకు పైరవీలకు పాల్పడే వ్యక్తులను నమ్మొద్దు అన్నారు. ఏ ఒక్క రూపాయి లేకుండా బడుగు బలహీన వర్గాల అర్హులైన పేదలందరికీ పార్టీలకు అతీతంగా ఏ పైరవి అవసరం లేకుండా కోదాడ శాసనసభ్యులు ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి అన్ని విధాలుగా అనంతగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. నాలుగు పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ సభల్లో జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.