by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:41 PM
ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ఇదే నిజం. ఓదెల మండలంలోని ఓదెల, శానగొండ, కనగర్తి, పో త్కపల్లి, కొలనూరు, ఇందుర్తి, నాంసానిపల్లి, గుంపుల, గోపరపల్లి, మడక, గ్రామాలలోగురువారం గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించాగా ఓదెల గ్రామసభలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 కే గ్యాస్ సిలిండర్ అమలు కాగా నూతనంగా మిగతా నాలుగు గ్యారంటీలను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రేషన్ కార్డులు, ఇందిరా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులకు నాలుగు గ్యారెంటీ సంక్షేమ పథకాలు ఈనెల 26 న అందించనున్నారు. 90% ఉచిత కరెంటు ఇచ్చిన ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు 87% రైతులకు రుణమాఫీ జరిగిందని, రైతులకు మాట తప్పకుండా 500 బోనస్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం .మూడు పసల్లు తూకంలో గింజ కటింగ్ లేకుండా చూస్తా, నాలుగు నెలల్లో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
డి 86 కెనాల్ నుండి జిలకుంట కెనాల్ బీర్జి వరకు రోడ్డు మంజూరు చేస్తానన్నారు. మండల కేంద్రమైన ఓదెలలో ఎస్బిఐ బ్యాంకు లేక ఖాతాదారులు, విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా బ్యాంకు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎంపీ ఓ ఎండి షబ్బీర్ పాషా, ఎమ్మార్వో యాకన్న, డిప్యూటీ తాసిల్దార్,ఎంపీడీవో తిరుపతి, ఏవో భాస్కర్, కార్యదర్శి చంద్రారెడ్డి మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపిటిసి బోడకుంట చిన్నస్వామి, శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అలా సుమన్ రెడ్డి, అల్లం సతీష్, పశ్చిమట్ల శ్రీనివాస్, చింతం స్వామి, క్యాతం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు