by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:40 PM
బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, గ్రామీణ అభివృద్ధి అధికారి కాలిందిని పాల్గొన్నారు.