by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:37 PM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 18 వ వార్డ్ లో శుక్రవారం ప్రజపాలన వార్డ్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేయాలని, ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పేదలకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, ప్రభుత్వ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.