by Suryaa Desk | Fri, Jan 24, 2025, 10:43 AM
మాటలు చెప్పడం కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం అన్నారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు కాలనీలో మౌళిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం చేయాలని, తర్వాత అభివృద్ధి మాత్రమే ముఖ్యం అనే ఆలోచనలతో నిరంతరం పనిచేస్తున్నామని, ప్రతి పక్ష నేతలపై దూషణలు చేయడం అవసరం లేదని అన్నారు.