by Suryaa Desk | Thu, Jan 23, 2025, 08:00 PM
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో పోలీసుల కీలక విషయాలను గుర్తించారు. మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే గురుమూర్తి భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి తన భార్యను చంపేసి, ముక్కలుగా నరికి, ఆ ముక్కలను ఉడికించి, ఎముకలను రోట్లో వేసి పొడి చేశాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా... ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.గురుమూర్తి సెల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో మరో మహిళ ఫొటోలు లభ్యమయ్యాయి. ఆ మహిళతో సంబంధం కారణంగానే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నెల 15న గురుమూర్తి, భార్య వెంకటమాధవి మధ్య ఆ మహిళ గురించి వాగ్వాదం చోటు చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.భార్య శవాన్ని పొడిగా చేసిన తర్వాత నిందితుడు జిల్లెలగూడ చెరువులో కలిపేసినట్లు పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు అక్కడ చూడగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.భార్య కనిపించడం లేదని గురుమూర్తి ఆమె తల్లిదండ్రులకు ఈ నెల 17న చెప్పాడు. మీర్‌పేటకు వచ్చిన ఆమె తల్లిదండ్రులు మరుసటి రోజు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ నెల 14న వెంకటమాధవి ఇంట్లోకి వచ్చినట్లుగా ఉంది. కానీ ఆ తర్వాత బయటకు వెళ్లినట్లుగా లేదు. ఆ తర్వాత గురుమూర్తిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. గురుమూర్తి చెప్పినచోట ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.