by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:59 PM
జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ నిరుద్యోగ యువతకు చేరువ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి లోని ఎంపీడీవో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలేడ్జ్) రీజనల్ సెంటర్ ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ద్వారా 2 బ్యాచ్ లకు శిక్షణ అందించామని, ప్రస్తుతం 3వ బ్యాచ్ కు ట్రైనింగ్ జరుగుతుందని అన్నారు.
టాస్క్ సెంటర్ ద్వారా అందించే వివిధ సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక కోర్సులు వివరాలను జిల్లాలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నిరుద్యోగ యువత వద్దకు చేరుకొని అవసరమైన కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు టాస్క్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు.టాస్క్ సెంటర్ ద్వారా 18 సంవత్సరాల నిండిన యువత శిక్షణ పొందవచ్చని,ఇక్కడ ఇంజనీరింగ్ ఫార్మసీ ,డిగ్రీ, ఐటిఐ ,డిప్లమా వంటి కోర్సులు చదివిన యువతకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, నైపుణ్య శిక్షణను అందించేందుకు ఈ టాస్క్ సెంటర్ ఉపయోగ పడుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రీజనల్ హెడ్ కం ట్రెనర్ డాక్టర్ టి కౌసల్య బాయ్ , తదితరులు పాల్గొన్నారు.