by Suryaa Desk | Fri, Jan 24, 2025, 01:14 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు పథకాల జారీలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పునరుద్ఘాటించారు. ప్రజల దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై అభిప్రాయ సేకరణ సర్వేకు సంబంధించి గురువారం కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. డీపీఓ భిక్షపతి, ఎంపీడీవో అంజాద్ పాషా పాల్గొన్నారు.