by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:41 PM
ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.నల్గొండలో జగదీష్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.'రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాల కంటే ప్రజలే ఎక్కువ ఎండగడుతున్నారు.తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు కుమ్మక్కయ్యాయి.ప్రజల సొమ్ము ,ఆస్తులను దోచుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.కోర్టు ఉత్తర్వుల ప్రకారం శాంతియుతంగా రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.మంత్రి కోమటిరెడ్డికి కోతలు తప్ప చేతలు లేవు'అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా,బీఆర్‌ఎస్ తలపెట్టిన నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది.ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్‌ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది.