by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:18 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. మెట్ పల్లి మండలం లో వెల్లుల గ్రామం లో నిర్వహించిన గ్రామ సభ లో పాల్గొన్నారు.రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకంగా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్హులకు లబ్ధి చెందాలని ప్రజల వద్దకె అధికారులు వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం చేసుకోవాలని పిలుపునిచ్చారు . పదేళ్ల లో గత భారసా ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ,కాంగ్రెస్ నాయకులు ఆకుల లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, నాయకులు రాజారెడ్డి, సురేష్, సంతోష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.