by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:11 PM
ముస్తాబాద్ మండల కేంద్రంలో సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిపిఐఎం మార్క్సిస్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ మండల నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కార్మిక వర్గం, కష్టజీవులు, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) సీపీఎం రాష్ట్ర 4 వ. మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాలలో ప్రజా సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలను సాధించిన విజయాలను చర్చించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేయవలసిన పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు.
ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు అవుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్నారు. హామీల అమలు విస్మరించి ప్రజాస్వామిక హక్కులపై నిర్బంధాలు కొనసాగిస్తే గత బిఆర్ఎస్ పార్టీ కి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనన్నారు.ముస్తాబాద్ మండలం నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఇట్టి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు*