by Suryaa Desk | Fri, Jan 24, 2025, 02:57 PM
TG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ అంబర్‌పేటలోని తులసీరాం నగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఆయన నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు మొదలైనవి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.