by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:56 PM
ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన ఈదునూరి లక్ష్మణ్ (31) బుధవారం సాయంత్రం నుండి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు చుట్టుపక్కల వారు వెతకడం మొదలుపెట్టారు.
ఎంత వెతికినా దొరకపోవడంతో ఇంటి ముందు ఉన్న చేదు బావి దగ్గరికి వెళ్లి చూడగా బావిలో పడి ఉండడంతో స్థానికులకు పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో మృతదేహాన్ని వెలికి తీశారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి తల్లి ఇచ్చినా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.