by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:34 PM
కొమురం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానాలను సాధించాలని ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్ పి ఎస్ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మోడల్ పేపర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల ఉర్దూ మీడియం విద్యార్థులకు పంపిణీ చేస్తున్న మోడల్ పేపర్లు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. ఆసక్తిగా చదివి విద్యార్థులు తల్లిదండ్రుల జిల్లాకు గుర్తింపు తీసుకురావాలన్నారు. చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అంతకముందు ఏఐఎంఐఎం పార్టీ ఆసిఫాబాద్ అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి.
ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లక్ష్యంతో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు మోడల్ పేపర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 20 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదివి రాష్ట్ర, జిల్లా టాపర్లుగా నిలువాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్టణ అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ కు పూలమాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులకు మోడల్ పేపర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిజాం, హైదరాబాద్ కార్పొరేటర్ జఫర్ , ఎంఐఎం వార్డ్ సభ్యుడు తాహెర్, పార్టీ నాయకులు అజీమొద్దీన్, ఫైసల్, కలాం, షాబాజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.