by Suryaa Desk | Fri, Jan 24, 2025, 02:54 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని ప్రస్తుతం గ్రౌండ్‌లో ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీఎంగా తొలిసారి దావోస్ టూర్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి గత సంవత్సరం రూ.40వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ప్రకటించగా.. రెండోసారి సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనకు వెళ్లి రూ. 1,70 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలు తీసేసి నువ్వు తెచ్చిన వాటిలో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? అనే దానిపై ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు వాస్తవాలు ఎంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయన్నారు.