by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:51 PM
3 టౌన్ బోసు బొమ్మ సెంటర్ ఏరియాలో ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ "నేతాజీ సుభాష్ చంద్రబోస్" జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించటం జరిగింది . ఈ సందర్భంగా బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ , ఖమ్మం జిల్లా ప్రముఖ వైద్యులు Dr. శీలం పాపారావు మాట్లాడుతూ ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప జాతీయవాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 1 టౌన్ అధ్యక్షులు గడిల నరేష్ , జిల్లా నాయకులు వీరవెల్లి రాజేష్ , బండ్ల రిగాన్ ప్రతాప్ , 1 టౌన్ నాయకులు పాలెపు రాము , త్రీ టౌన్ నాయకులు అంకటి పాపారావు , జంగిలి రమణ , దార్ల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .