by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:23 PM
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో గల పెద్దమ్మ ఆలయంలో గురువారం బోర్ వెల్ పనులను మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరానగర్ గ్రామస్తులు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి బోర్ వెల్ విషయాన్ని విన్నవించగా, ఆయన ఆదేశాల మేరకు బోర్ వేసినట్లు చెప్పారు. కుల సంఘం నాయకులతో కలిసి, కొబ్బరికాయ బోర్ వేయించారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దామ అంజయ్య, కాంగ్రెస్ నాయకులు మెంగని తిరుపతి, సుంకె నరేందర్, కిరణ్, చక్రం అంజి, సదానందం, కుంభం వెంకటేష్, కూన రవి, చంద్రయ్య, దామ నర్సయ్య, కూన రమేష్, కూన శ్రీనివాస్, కూన అంజయ్య, అనిల్, చక్రి, కూన రాయమల్లు, శ్రీనివాస్, బల్ల సతీష్, సీనన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.