by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:21 PM
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన పరాక్రమ్ దివాస్ గా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి మణికంఠ హై స్కూల్ లో పరాక్రమ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు నేతాజీ పేరు ఏర్పడే విధంగా పలు విన్యాసాలు చేశారు మరియు విద్యార్థినిలు నేతాజీ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ పౌచ్ ను గుర్తు చేసుకునేలా పెరేడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని మరియు దేశం ముందు తర్వాతే మనం అని సందేశాన్ని ఇచ్చారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ పిల్లలందరూ సుభాష్ చంద్రబోస్ లాగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లాలని చదువుతోపాటు జీవితంలో కూడా ఉన్నత శిఖరాలలో నిలబడి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .