by Suryaa Desk | Fri, Jan 24, 2025, 04:08 PM
నామాపూర్ ముస్తాబాద్ పోతుగల్ బదనకల్ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్యఅతిథిగా తాసిల్దార్ సురేష్ మండల కాంగ్రెస్ పార్టీ ఎల్ల బాల్ రెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో నాలుగు పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. రైతు భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకలు లబ్ధిదారులను గ్రామసభలో ప్రకటించగా తాసిల్దార్ సురేష్ పథకాలలో రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా పేదలకు అందిస్తున్న పథకాలన్నీ నిరంతర ప్రక్రియని అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందిస్తుందని. ఈ నాలుగు పథకాలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు అంతేగాక గత ప్రభుత్వంలో రైతు భరోసా గుడ్డలకు రోడ్డులకు రైతు భరోసా అందించిందని అలాగే 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి. ఆయా గ్రామాల కార్యదర్శిలు మాజీ సర్పంచ్ లు తన్నీరు గౌతమ్ వెలుముల విజయ రామ్ రెడ్డి. ఓరుగంటి తిరుపతి..మాజీ వార్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.