by Suryaa Desk | Fri, Jan 24, 2025, 02:16 PM
ప్రభుత్వ అనుభవ రాహిత్య తీరుతో తెలంగాణ రాష్ట్రంలో వార్డు సభల నిర్వహణపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపేట్ రాజీవ్ గృహకల్పనందు వార్డు సభ నిర్వహణను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు, స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ....
-గ్రామసభల, వార్డు సభల నిర్వహణ పూర్తిగా ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురి చేసే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
- ఇందిరమ్మ ఇళ్ల కోసం వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం ఇంకెన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటుంది, ప్రజలు ఇంకెన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవాలి.
- గత ఆరు నెలలుగా రేషన్ కార్డులను రేపిస్తాం, మాపిస్తాం అంటూ కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తే గతంలో చేసిన సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, దరఖాస్తులు దేనికి. సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న జాబితా....తుది జాబితానా, అర్హుల జాబితానా, లేక దరఖాస్తు దారుల జాబితానా అనేది స్పష్టత లేదు.
- జనవరి 26న అర్హుల జాబితా ప్రకటిస్తామంటున్న ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంటూ ఇంకా అర్హుల జాబితాను తయారు చేయకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది.
- వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానంటున్న ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసే కెసిఆర్ కిట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను బంద్ చేసారని ప్రజలు బాధపడుతున్నారు.
- జనవరి 26 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
-కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం.