by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:23 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రజలు ఆందోళన చెందవదని అనంతగిరి కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడు ఓరుగంటి హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు గృహ నిర్మాణాలు ఇచ్చి ఉంటే ఇంత స్టోరేజీ ఉండేది కాదని అన్నారు. గత బారాస ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధికి ఒరగబెట్టిందిదేమీ లేదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మరియు మండల అభివృద్ధి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోదాడ శాసనసభ్యులు చర్యలు తీసుకుంటున్నారు లబ్ధిదారుల ఎంపికలో తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
పథకాల అమలులో గ్రామసభల్లో చదువుతున్న జాబితా ఖరారైoదని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులను ప్రజల సమక్షంలో ప్రజలచేత ఆమోదం చేయించి ప్రతి పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి పనిచేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జ్ఞానేందర్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.