by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:51 PM
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతున్న నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు జరుగుతుందని గ్రామాలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడం జరుగుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పశు గణన అభివృద్ధి సంస్థ మాజీ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం అలిరాజపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ముందుగా గ్రామ సభ ముసాయిదా కమిటీ లబ్ధిదారుల నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు.
ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామాల్లో గ్రామసభల నిర్వహించడం జరుగుతుందన్నారు. కొంతమంది కావాలని గ్రామసభలో గొడవలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అర్హులైన వారు ఎప్పుడైనా అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, అంగన్‌వాడీ సూపర్ వైజర్ భవాని, మాజీ సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమ్య రవి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, వివిధ పార్టీల నాయకులు బాపురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, కృష్ణ, సత్తిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు...