by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:05 PM
తెలంగాణలో రానున్న 3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది. రేపు రాష్ట్రంలోని అదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం పేర్కొంది.