by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:08 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణ చేపడుతోంది. ఈ కంపెనీ ద్వారా వచ్చే రెండేళ్లలో 1800 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. హైదరాబాద్‌లోని తమ జీసీసీ (గ్లోబల్ కేపబులిటీ సెంటర్) విస్తరిస్తామని యూబీఎస్ ఇండియా ఛైర్మన్ హరాల్డ్ ఎగ్గెర్ వెల్లడించారు.