by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:06 PM
షాద్‌నగర్‌లో శివలీల(35) అనే మహిళా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండు హత్యలు, హత్యాయత్నాల కేసుల్లో నిందితుడైన దేవదాస్.. పెళ్లి చేసుకోమన్నందుకు ఈ హత్య చేసినట్లు వారు వెల్లడించారు. కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన దేవదాస్.. శివలీలను చంపి బంగారు అభరణాలతో పారిపోయినట్లు తెలిపారు.