by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:45 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.