by Suryaa Desk | Sun, Jan 26, 2025, 02:30 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ధర్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. ముందుగా స్వామి వారి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.