by Suryaa Desk | Sat, Jan 25, 2025, 12:46 PM
తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. రుణమాఫీ కాలేదని, అప్పుల భారం ఎక్కువై దానిని తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.స్థానికుల కథనం ప్రకారం.. మైల నర్సయ్య అనే అన్నదాతకు ప్రభుత్వం ఇటీవల చేసిన రుణమాఫీ కాలేదు.దీంతో పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో పొలం వద్దనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి రైతులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వంద శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. ఈ అన్నదాత చావుకు ఎవరు సమాధానం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది.