by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:57 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉర్సిగుట్ట జక్కులొదీ క్రాస్ రోడ్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కొండా సురేఖ వెంటనే తన కాన్వాయ్ దిగి క్షత్రగాత్రుడికి సాయం అందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు తెలుసుకొని సొంత కాన్వాయ్ లోని వాహనం పంపి ఆయన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు.క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుడికి అవసరమైన వైద్య సాయం అందించేందుకు తక్షణమే అందజేయాలని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఏదైనా సాయం అవసరం ఉంటే సంప్రదించాలని చెప్పారు.