by Suryaa Desk | Sun, Jan 26, 2025, 11:07 AM
కొత్త ఏడాది ప్రారంభం నాటి నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇటీవల కాస్త తగ్గినట్లు అనిపించినా.. అమెరికాలో అలా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారో..లేదో, బంగారం ధరలకు మరింత జోరందుకున్నాయి.. పసిడి ధరలకు రెక్కలొచ్చినట్లు.. తగ్గే ఛాన్సేలేదు అన్నట్లుగా గోల్డ్ స్పీడు హైరేంజ్‌లో పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.82 వేల మార్క్ దాటి దూసుకెళ్తోంది.. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి..అయితే.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ.82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ.97,500 లుగా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,700, 24 క్యారెట్ల ధర రూ.82,570 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.75,550, 24 క్యారెట్లు రూ.82,420 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.