by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:18 PM
గొల్లపల్లి మండలం నందిపల్లె గ్రామంలో గొల్లకేతమ్మ అమ్మవారి పట్నల సందర్భంగా అమ్మవారిని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన మాలగామ మల్లన్న దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యర్థం నీటి సదుపాయం.
ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విప్ లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి విన్నవించగ వెంటనే స్పందించి బోర్వెల్ను మంజూరు చేసి దాన్ని గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బోర్వెల్ ను మంజూరు చేసిందుకు విప్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్,తదితరులు పాల్గొన్నారు.