by Suryaa Desk | Sat, Jan 25, 2025, 12:45 PM
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన కూడా పూర్తయింది. కానీ ఇంకా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో తెలియదు.. నామినేటెడ్ పోస్టుల ఊసేలేదు. ఇదేం బాధరా అయ్యా అని తలలు పంటుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. మంత్రి పదవి వస్తుందని కొందరు.. నామినేటెడ్ పోస్ట్ కోసం ఇంకొందరు చాలా రోజులుగా నేతలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఏడాదైనా నామినేటెడ్ పదవులపై స్పష్టత రాకపోవడంతో నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.