by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:53 PM
హైదరాబాద్ నగర మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రోలో ప్రయాణించే వారు స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్యరహిత వాహనాలను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లు, కార్యాలయం, కాలేజీలకు వెళ్లే వారు తమ సొంత వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎలక్ట్రానిక్ వెహికిల్ జిప్ వాహనాలతో తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చునని తెలిపింది.ఢిల్లీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద మెట్రో హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఉద్యోగం చేసేవారు, స్కూల్స్, కాలేజీకి వెళ్లేవారు, వ్యాపారస్తులు ఎంతోమంది మెట్రో రైలును వినియోగిస్తుంటారు. వీరంతా మెట్రో స్టేషన్‌కు రావడానికి, మెట్రో నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు, సొంత వాహనాలు వినియోగిస్తుంటారు.అయితే తాజాగా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని మెట్రో నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.మహిళలకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. బైక్ నడపడంలోనూ మెళకువలు నేర్పిస్తున్నారు. రద్దీలో వాహనాలు నడపడంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చినట్లు, భవిష్యత్తులో వంద మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సయోధ్య ఫౌండేషన్ మృదులత చెప్పారు.