by Suryaa Desk | Sun, Jan 26, 2025, 02:55 PM
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పార్థివ దేహానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సత్యనారాయణ తన దైన ముద్ర వేశారన్నారు.తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమన్నారు.సత్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు దేవీ ప్రసాద్, జైపాల్ రెడ్డి, ఎం.భిక్షపతి,జిల్లా నాయకులు శివకుమార్, మాణిక్యం, మందుల వరలక్ష్మి, మామిళ్ల రాజేందర్ తదితరులు.