by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:09 PM
ఆడపిల్లను రక్షించుకుందాం-ఆడపిల్లను చదివించుకుందాం అనే మాటను సమాజంలో ప్రతి వ్యక్తికి చేరే విధంగా,జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మోడల్ స్కూల్ లో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ ధైర్ కెరీర్ అనే అంశం పైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ సుంకరి రవి నిర్వహించారు.ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు,వారి ప్రవర్తన,అమ్మానాన్నల ప్రేమ,చదువు కెరీర్,విషయాలను గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు.కార్యక్రమంలో లీడ్ ఇండియా ట్రైనర్లు శ్రీనివాస్,తిరుపతి విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం పట్ల,విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుంకరి రవి మాట్లాడుతూ తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి,అధ్యాపకులు పాల్గొన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు థ్యాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'సోర్స్ కోడ్ - ఏ మెమరీ అబౌట్ ది ఎక్స్‌పీరియన్సెస్ అండ్ లెసన్స్ దట్ షేప్డ్ హిస్ ఇన్‌క్రిడబుల్ జర్నీ' అనే పుస్తకాన్ని బిల్ గేట్స్ రచించారు. ఆ పుస్తకాన్ని తనకు బహుమతిగా పంపించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆ బుక్ విడుదలకు ముందే తనకు బహుకరించడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.