by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:52 PM
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్, బుద్వేల్ నేతాజీ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. బాలకృష్ణ విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. ప్రాథమిక స్థాయిలోనే ఓటు హక్కు విలువను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అని విద్యార్థులకు తెలియజేశారు.