by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:52 PM
గ్రామాల అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన జగదేవపూర్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఆత్మ భరోసా పథకంలో పది గుంటల వరకు ఉన్న లబ్ధిదారులకు కూడా అందించాలని తెలిపారు.
అలాగే గుంట భూమిలేని ఇతర పనులు చేసే వారికి కూడా ఉపాధితో లింకు లేకుండా ఆత్మీయ భరోసా అందించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో ముందుగా నిరుపేదలకు అవకాశం కల్పించాలని చెప్పారు. గత ప్రభుత్వ పరిపాలనలో పది ఏళ్లలో ఎక్కడ కూడా గ్రామాల్లో పథకాలపై గ్రామసభలు నిర్వహించలేదని ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తే బిఆర్ఎస్ నేతలు గ్రామ సభలను అడ్డుకోవడం విడ్డూరకరమన్నారు. గ్రామంలో గ్రామ సభ ద్వారా చర్చలు పెడితేనే పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులు గుర్తించడం జరుగుతుందన్నారు.