by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:50 PM
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. రేపు ఆదివారం కావడంతో మందుబాబులు ఈరోజే వైన్ షాపుల ముందు బారులు తీరారు. శనివారం రాత్రి నుంచే మద్యం దుకాణాలతో పాటు.. బార్లు, పబ్స్ కూడా మూసివేయనున్నారు. తిరిగి సోమవారం రోజు తెరుచుకోనున్నాయి. కాగా, రేపు మద్యం షాపులతో పాటు కొన్నిచోట్ల మటన్, చికెన్ షాపులు సైతం మూసివేయనున్నారు.