by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:26 PM
కొత్త పథకాల అమలుపై కలెక్టర్లతో CS శాంతికుమారి వీడియో సమావేశం నిర్వహించారు. ప్రతి లబ్దిదారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా, పండగలా ప్రారంభ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు MPDO, రేషన్ కార్డులకు తహశీల్దార్ బృందం, రైతు భరోసాకు డిప్యూటీ తహశీల్దార్/రెవెన్యూ ఇన్స్పెక్టర్, MAO, ఆత్మీయ భరోసాకు MGNREGS ఏపీవోలు హాజరై ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.