by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:10 PM
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం మునిరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న కేసీఆర్.. సోదరి పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు.ప్రస్తుతం సకలమ్మ అంతిమయాత్ర కొనసాగుతున్నది. పూడూరులోని స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గాన్నారు. కాగా, కేసీఆర్‌కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు.దివంగత తన అక్క చీటి సకలమ్మ గారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.